బక్రీద్ మటన్ బిర్యానీ
  • 513 Views

బక్రీద్ మటన్ బిర్యానీ

కావలసినవి:

  • మటన్ - పావు కేజీ;
  • బాస్మతి బియ్యం - 2 గ్లాసులు;
  • నీళ్లు - 3 గ్లాసులు;
  • పచ్చిమిర్చి - 4 (నిలువుగా కట్ చేయాలి);
  • అల్లం-వెల్లుల్లి పేస్ట్ - టీ స్పూన్;
  • నూనె - 2 టీ స్పూన్లు;
  • నెయ్యి - 2 టీ స్పూన్లు;
  • ఉప్పు - తగినంత;
  • ఉల్లిపాయ పేస్ట్ - 3 టీ స్పూన్లు;
  • దాల్చినచెక్క - చిన్న ముక్క;
  • షాజీరా - టీ స్పూన్;
  • ఏలకులు - 4;
  • పుదీనా - చిన్న కట్ట;
  • కొత్తిమీర - చిన్న కట్ట

విధానం:

బాస్మతి బియ్యం కడిగి సగం ఉడికిన (కొద్దిగా పలుకుగా ఉండేలా చూసుకోవాలి) తరవాత అందులోని నీటిని వంపేసి ఆ అన్నాన్ని పక్కన ఉంచుకోవాలి. ఒక బాణలిలో నెయ్యి, నూనె వేసి వేడయ్యాక షాజీరా, ఏలకులు, దాల్చినచెక్క వేసి వేయించాలి. తర్వాత ఉల్లిపేస్ట్, అల్లంవెల్లుల్లి పేస్ట్ వేసి గోధుమరంగు వచ్చేవరకు వేయించాలి. తరువాత పచ్చిమిర్చి , పుదీనా ఆకులు, ఉప్పు, మటన్ (కుకర్‌లో తగినన్ని నీళ్లు పోసి ఉడికించి పెట్టుకున్నది) వేసి బాగా వేగనిచ్చి పక్కన ఉంచుకోవాలి. ప్రెజర్‌పాన్‌లో కొద్దిగా నెయ్యి వేసి కరిగాక... ఉడికించి ఉంచిన మటన్ మిశ్రమాన్ని ఒక లేయర్‌గాను, దానిపైన అన్నాన్ని మరో లేయర్‌గా... ఇలా లేయర్లుగా పరిచి, సన్నని మంటమీద ఉడికించి దించేయాలి. చివరగా కొత్తిమీరతో గార్నిష్ చేయాలి.