వెన్న మురుకులు
  • 553 Views

వెన్న మురుకులు

కావలసినవి:

  • బియ్యప్పిండి - 3 కప్పులు
  • సెనగపిండి - 1/2కప్పు
  • వేయించిన సెనగపప్పు పొడి (పుట్నాల పౌడర్)- 1 టేబుల్ స్పూన్
  • వెన్న - 1 టేబుల్ స్పూన్
  • ఉప్పు - తగినంత
  • వాము - 1/2 టీ స్పూన్
  • నూనె -వేయించడానికి సరిపడా

విధానం:

పైన చెప్పిన మూడురకాల పిండులను కలిపి జల్లించి పక్కన వుంచండి. పిండి లో ఉప్పు ,వెన్న ,వాము వేసి రెండు
చేతులతో కలుపుతూ -నీళ్లు చేర్చి ముద్దలా చేయండి. మురుకులు(జంతికలు)గొట్టం తీసుకుని ,లోపల నూనె పూయండి. ఇప్పుడు పిండిముద్దను గొట్టం లో పెట్టి , కాగుతున్న వేడి నూనె లో మురుకులు గా తిప్పండి.వీటిని బంగారు రంగు వచ్చే వరకు వేయించండి. వేయించిన మురుకుల్ని పేపర్ మీద పరిస్తే
ఎక్కువైనా నూనె ను పీల్చుకుంటాయి. ఇప్పుడు వేడి వేడి వెన్న మురుకులు తయారు.