కొత్తిమీర రైస్‌
  • 646 Views

కొత్తిమీర రైస్‌

కావలసినవి:

  • కొత్తిమీర కట్టలు-3,
  • బియ్యం-అరకిలో
  • జీలకర్ర, ఆవాలు-రెండు టీ స్పూన్స్‌
  • పచ్చిమిరపకాయలు-6,
  • అల్లంముక్కలు -1 టేబుల్‌ స్పూన్‌,
  • వేరుశేనగ గుళ్ళు- 1 టేబుల్‌ స్పూన్‌
  • జీడిపప్పు-1 టేబుల్‌ స్పూన్‌,
  • ఉప్పు- తగినంత

విధానం:

ముందుగా అన్నం వండి పక్కన ఉంచుకోవాలి. ఆ తరువాత పొయ్యి మీద మూకుడు ఉంచి నూనె కాగిన తర్వాత కొత్తి మీర వేయించి దానిలో జీలకర్ర, ఆవాలు, పచ్చిమిరపకాయల ముక్కలు , అల్లం ముక్కలు, వేరుశనగ గుళ్లు, జీడిపప్పు వేసి వేయించుకోవాలి. కొంచెం వేగిన తర్వాత పసుపు ,ఉప్పు, వండిపెట్టుకున్న అన్నం వేసి బాగా కలియబెట్టాలి. ఇంకేముంది కొత్తిమీర రైస్‌ రెడీ.