దమ్‌ కీమా
  • 75 Views

దమ్‌ కీమా

కావలసినవి:

  • కీమా - అర కిలో,
  • ఉల్లిపాయలు - 4,
  • కొబ్బరి - 100 గ్రాములు,
  • గరం మసాలా - 1 స్పూన్‌,
  • గసగసాలు - 2 స్పూన్లు,
  • పచ్చిమిర్చి - 4, ఉప్పు,
  • కారం - రుచికి తగినంత,
  • పసుపు - పావు స్పూన్‌,
  • పెరుగు - 100 గ్రాములు,
  • నూనె - పావు కిలో,
  • కొత్తిమీర - 1 కట్ట,
  • పుదీన - 1 కట్ట

విధానం:

బాండీలో కొబ్బరి, గసగసాలు, ఉల్లిపాయ ముక్కలు వేయించి మెత్తగా రుబ్బుకోవాలి. ఈ మిశ్రమాన్ని కడిగిన కీమాలో కలపాలి. ఇందులోనే మిగిలిన పదార్థాలను కూడా చేర్చి సరిపడా నీళ్లు పోసి కుక్కరులో పావుగంట ఉడికించాలి. ఆవిరి పోయాక మూత తీసి మంట తగ్గించి ఈ మిశ్రమం మొత్తం దగ్గర పడేవరకు వేయించాలి. చివర్లో కొత్తిమీర, పుదీనా తరుగు కలిపితే చాలు. కీమా సిద్ధమైనట్లే.