మూంగ్‌దాల్ బర్ఫీ
  • 63 Views

మూంగ్‌దాల్ బర్ఫీ

కావలసినవి:

  • పెసరపప్పు (పొట్టులేకుండా)- 500 గ్రా
  • కోవా - 100 గ్రా
  • కుంకుమపువ్వు - చిటికెడు
  • ఏలకుల పొడి - మూడు గ్రాములు
  • చక్కెర - 400 గ్రా,
  • నెయ్యి- 200 గ్రా

విధానం:

పెసరపప్పును కడిగి మూడుగంటల సేపు వేడినీటిలో నానబెట్టాలి. తర్వాత నీటిని వంపేసి క్లాత్ మీద వేసి తడిపోయేటట్లు చేయాలి. ఇప్పుడు బాణలిలో నెయ్యి వేసి సన్నమంట మీద నానిన పెసరపప్పును వేయించాలి. దోరగా వేగిన తర్వాత దించేసి, పూర్తిగా చల్లారిన తర్వాత తగినంత నీటిని చేర్చి మెత్తగా గ్రైండ్ చేయాలి. బాణలిలో మిగిలిన నేతిలో పెసరపప్పు పేస్ట్, చక్కెర వేసి సన్నమంట మీద ఉడికించాలి. చక్కెర కరిగిన తరవాత కుంకుమపువ్వు వేయాలి. మిశ్రమం బాణలికి అతుక్కోకుండా దగ్గరయ్యే వరకు కలుపుతూ ఉండాలి. ఇప్పుడు కోవా, ఏలకుల పొడి వేసి బాగా కలిపి దించాలి. ఒక ట్రేకి నెయ్యిరాసి బర్ఫీ మిశ్రమాన్ని వేసి సమంగా సర్ది పైన సిల్వర్ పేపర్‌ను అతికించాలి. వేడి తగ్గిన తర్వాత మనకు కావల్సిన ఆకారంలో కట్ చేయాలి. సిల్వర్ పేపర్ అతికించకుండా పైన డ్రైఫ్రూట్స్‌తో గార్నిష్ చేయవచ్చు.

నోట్:
మిశ్రమాన్ని ఎంత సేపు ఉడికించాలంటే... చేతికి నెయ్యిరాసి కొద్దిగా మిశ్రమాన్ని చేతిలోకి తీసుకుని బాల్‌లాగ చేస్తే చేతికి అతుక్కోకుండా రావాలి. అతుక్కుంటోంది అంటే మరికొంత సేపు ఉడికించాలని అర్థం.