పాలక్‌ మటన్‌ కర్రీ
  • 101 Views

పాలక్‌ మటన్‌ కర్రీ

కావలసినవి:

  • పాలకూర - ఒక కేజి.
  • మంచి టమోటాలు - 4
  • పచ్చి బఠాణీలు - 200‚ గ్రా.
  • కొత్తిమీర - సన్నగా తరిగి
  • నెయ్యి - 2 టేబుల్‌ స్పూన్లు
  • మీగడ - 2 టేబుల్‌ స్పూన్లు
  • వెల్లుల్లి రెబ్బలు - 10
  • ఉప్పు - సరిపడ
  • కారం - సరిపడ

విధానం:

పాలకూరని ఉడకబెట్టి అందులో సగం మెత్తగా చేసుకొని, మిగిలిన సగం బాగా తరుక్కోవాలి. మూడు టమాటాలను సన్నగా తరిగి ఒక టమాటాను పెద్ద ముక్కలుగా తరిగి పెట్టుకోవాలి. మందంగా ఉన్న బాణలి తీసుకొని అందులో నెయ్యి, జీలకర్ర వేసి అది చిటపటలాడుతున్నప్పుడు వెల్లుల్లి ముక్కలు వేసి బంగారు రంగు వచ్చే వరకూ వేగనివ్వాలి.

తర్వాత సన్నగా తరుక్కున్న టమాటా ముక్కలను వేసి అది మెత్తగా అయ్యే వరకూ ఉడకనివ్వాలి. అందులో పచ్చి బఠాణీ వేసి ఉడకన్వివాలి. తర్వాత తరిగి పెట్టుకున్న పాలకూర వేసి పెద్ద మంట మీద ఉడకనివ్వాలి. తర్వాత పాలకూర గుజ్జు వేసి కాసేపు ఉడకబెట్టాలి. ఇందులో కారం, ఉప్పు వేసి చివరగా మీగడ వేయాలి. పెద్దగా తరిగి పెట్టుకున్న టమాటాలను అలంకరించి చపాతీలతో సర్వ్‌ చేస్తే మంచి టేస్ట్ లభిస్తుంది.