మటన్‌ కబాబ్‌
  • 130 Views

మటన్‌ కబాబ్‌

కావలసినవి:

  • బోన్‌లెస్‌ మటన్‌ - 1 కిలో,
  • ఉల్లిపాయలు - 4
  • వెల్లుల్లిపాయ - 1,
  • కారం - అర టేబుల్‌ స్పూన్‌
  • పసుపు - పావు టీ స్పూన్‌,
  • కొత్తిమీర కట్ట - 1
  • పచ్చిమిర్చి - 6, గుడ్డు - 1,
  • బాదం పప్పు - 50 గ్రాములు,
  • చిరోంజి పప్పు - 50 గ్రాములు
  • నిమ్మకాయ - 1,
  • ఉప్పు - సరిపడా
  • నూనె - సరిపడా

విధానం:

రెండు ఉల్లిపాయలు ముక్కలు కోసి అందులో సగం నూనెలో వేయించి పక్కన పెట్టుకోవాలి. శుభ్రంగా కడిగిన మటన్‌ ముక్కల్లో వేయించిన ఉల్లిపాయ ముక్కలు, పచ్చి ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, వెల్లుల్లి రెబ్బలు, ఉప్పు, కొత్తిమీర తురుము, పసుపు కలపాలి. ఈ మిశ్రమాన్ని కుక్కర్‌లో ఉడికించాలి. వీటిని కాగిన నూనెలో వేయించి చల్లారనివ్వాలి. తర్వాత మిక్సీలో వేసి మెత్తగా గ్రైండ్‌ చేయాలి. బాదం, చిరోంజి పప్పులను నానబెట్టి మెత్తగా రుబ్బుకోవాలి. ఇందులో కోడిగుడ్డు సొన కలపాలి. మెత్తగా గ్రైండ్‌ చేసుకున్న మటన్‌ మిశ్రమంలో మిగిలిన ఉల్లిపాయ, పచ్చిమిర్చి ముక్కలు, కొత్తిమీర తురుము, బాదం పప్పుల పేస్ట్‌ కలపాలి. ఈ మొత్తం మిశ్రమాన్ని చిన్న చిన్న వుండలు చేసుకుని వడల్లా చేసి కాగిన నూనెలో వేయిస్తే చాలు. నోరూరించే కబాబ్‌లు రెడీ.