పాలక్ పనీర్ మటన్
  • 82 Views

పాలక్ పనీర్ మటన్

కావలసినవి:

  • పాలకూర - కప్పు,
  • మటన్ - 250 గ్రా.,
  • పనీర్ - కప్పు (ముక్కలుగా కట్ చేసి, నూనెలో వేయించి పెట్టుకోవాలి),
  • పచ్చిమిర్చి తరుగు - 2 టేబుల్ స్పూన్లు,
  • ఉల్లిపాయ తరుగు - కప్పు,
  • అల్లం వెల్లుల్లి పేస్ట్ - టీ స్పూన్,
  • పసుపు - అర టీ స్పూన్,
  • కారం - రెండున్నర టీ స్పూన్లు,
  • ఉప్పు - ఒకటిన్నర టీ స్పూన్,
  • సాజీర - అర టీ స్పూన్,
  • గరం మసాలా - అర టీ స్పూన్,
  • ధనియాల పొడి - టీ స్పూన్,
  • కొబ్బరిపొడి - ఒకటిన్నర టీ స్పూన్,
  • కొత్తిమీర - టీ స్పూన్

విధానం:

మటన్ విడిగా ఉడికించి పక్కన పెట్టాలి. మరిగించిన నీళ్లలో పాలకూర వేసి, తర్వాత నీరు వంపేసి గ్రైండ్ చేసుకోవాలి. బాణలిలో నూనె వేడయ్యాక సాజీర, ఉల్లిపాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు వేసి వేగనివ్వాలి. తర్వాత పాలక్ పేస్ట్ వేసి నూనె తేలేవరకు ఉడికించాలి. పనీర్‌ముక్కలు, పచ్చిమిర్చి పేస్ట్, ఉప్పు, ఉడికిన మటన్ వేసి మూత పెట్టాలి. ఐదు నిమిషాల తర్వాత కొబ్బరిపొడి, ధనియాలపొడి, గరం మసాలా వేసి కలిపి ఉడికాక, చివరగా కొత్తిమీర చల్లి దించాలి.