టొమాటో పిజ్జా
  • 112 Views

టొమాటో పిజ్జా

కావలసినవి:

  • టొమాటో ముక్కలు - కప్పు,
  • క్యాప్సికమ్ తరుగు - పావుకప్పు,
  • వెల్లుల్లి ముద్ద - రెండు చెంచాలు,
  •  ఉల్లిపాయ ముద్ద - 2 స్పూన్లు,
  •  రోజ్‌మేరీ - పావుచెంచా,
  •  ఆరీగానో - పావుచెంచా,
  •  బేబీకార్న్ - రెండు,
  •  పుట్టగొడుగులు - రెండుముక్కలు,
  •  బటర్ - కొద్దిగా,
  • ఉప్పు - తగినంత,
  • కారం - తగినంత,
  • పిజ్జాబేస్ - 1 (బేకరీ, సూపర్ మార్కెట్లలో దొరుకుతుంది),
  • బీన్స్ తరుగు - పావు కప్పు.

విధానం:

ఒక పాన్‌లో కొద్దిగా బటర్ వేసి కాగిన తరవాత ఉల్లిపాయముద్ద, వెల్లుల్లి ముద్ద వేసి వేయించాలి. తరువాత టొమాటో ముక్కలు వేసి 5 నిముషాలు ఉడికించి ఉప్పు, కారం కలపాలి. తరవాత మిగిలిన పదార్థాలన్నీ వేసి 5 నిముషాలు ఉడికించాలి. ఈ మిశ్రమాన్ని పిజ్జా బేస్ మీద పరిచి పైన బీన్స్ తరుగు వేయాలి. దీనిని 180 డిగ్రీల సెంటీగ్రేడ్‌లో 5 నిముషాలు బేక్ చేయాలి.