రంజాన్ స్పెషల్ ఖైబర్‌ బిర్యాని
  • 66 Views

రంజాన్ స్పెషల్ ఖైబర్‌ బిర్యాని

కావలసినవి:

  • బియ్యం - 1 కిలో,
  • మటన్‌ ముక్కలు - 1 కిలో
  • పెరుగు - ఒకటిన్నర లీటరు
  • ఉప్పు - సరిపడా, ఉల్లిపాయలు - 3
  • అల్లం వెల్లుల్లి పేస్ట్‌ - 2 టేబుల్‌ స్పూన్లు
  • ధనియాల పొడి - 2 టేబుల్‌ స్పూన్లు
  • యాలకుల పొడి - అర టీ స్పూన్‌
  • మిరియాల పొడి - 2 టీ స్పూన్లు
  • దాల్చిన చెక్క - కొద్దిగా,
  • జీలకర్ర - 1 స్పూన్‌
  • కుంకుమ పువ్వు - చిటికెడు,
  • లవంగాలు - 20
  • నీళ్లు - 2 కప్పులు,
  • నెయ్యి - పావు కిలో

విధానం:

శుభ్రం చేసిన మటన్‌ చిన్న ముక్కలు చేయాలి. దానికి అల్లం వెల్లుల్లి ముద్ద, ఉల్లిపాయ ముద్ద, ధనియాల పొడి, దాల్చిన చెక్క పొడి, యాలకుల పొడి, మిరియాల పొడి, జీలకర్ర, కుంకుమ పువ్వు, లీటర్‌ పెరుగు, నీళ్లు పోసి బాగా కలియబెట్టాలి. ఈ మిశ్రమాన్ని రెండు గంటలు నానబెట్టాలి. పాన్‌లో అడుగున మటన్‌ ముక్కలు వేసి సమానంగా సర్దాలి. బాండీలో సగం నెయ్యి వేసి లవంగాలు వేయించాలి. వీటిని మటన్‌ ముక్కల మీద వంపాలి. కడిగిన బియ్యానికి అరలీటర్‌ పెరుగు కలపాలి. ఈ మిశ్రమాన్ని మటన్‌ ముక్కలమీద వేసి మూత పెట్టి ఉడికించాలి. ఆవిరి రావడం మొదలవగానే మంట సిమ్‌లో పెట్టి దమ్‌ చేయాలి. పెరుగంతా ఇంకిపోయిన తర్వాత మిగిలిన నెయ్యి వేసి మరో 15 నిముషాలు ఉడికించాలి. ఈ బిర్యానిని పెరుగుతో వండితేనే బాగుంటుంది.