అడై ప్రదమన్
  • 404 Views

అడై ప్రదమన్

కావలసినవి:

  • రైస్ అడై (బియ్యప్పిండి వడియాలు) - 200 గ్రా.,
  • ఏలకుల పొడి - 10 గ్రా.,
  • జీడిపప్పు - 50గ్రా.,
  • కొబ్బరిపాలు - కప్పు,
  • నెయ్యి - 200 గ్రా.,
  • బెల్లం - అర కప్పు,
  • కిస్‌మిస్ - 25 గ్రా.

విధానం:

మందపాటి గిన్నెలో కొద్దిగా నీరు, బెల్లం వేసి కరిగించి పక్కన పెట్టుకోవాలి. పాన్‌లో నీరు వేడి చేసుకుని అందులో రైస్ అడై వేసి మెత్తగా ఉడికించాలి. తరవాత ఒక గిన్నెలోకి తీసుకోవాలి. పాన్‌లో కరిగించిన బెల్లం, ఉడికించిన రైస్ అడై వేసి సన్నమంట మీద మరోమారు ఉడికించాలి. ఇప్పుడు పచ్చికొబ్బరి పాలను ఉడుకుతున్న రైస్ అడై మిశ్రమంలో వేసి కలిపి, చిక్కబడిన తరవాత దింపేయాలి. పాన్‌లో నెయ్యి వేడయ్యాక అందులో జీడిపప్పు, కిస్‌మిస్, ఏలకుల పొడి వేసి వేయించి వాటితో అడై మిశ్రమాన్ని గార్నిష్ చేయాలి.