బాదం మిల్క్
  • 447 Views

బాదం మిల్క్

కావలసినవి:

  • పాలు.. 5 లీ.
  • పంచదార.. 1 కేజీ
  • బాదం మాస్.. తగినంత
  • యాలకుల పొడి.. ఒక టీ.
  • జీడిపప్పు, బాదంపప్పు.. తగినంత

విధానం:

బాదం మిల్క్ తయారు చేసేందుకు పాలలో వెన్న పూర్తిగా తీయకుండా 6 శాతం ఫ్యాట్ ఉన్న పాలను తీసుకోవాలి. వాటిలో యాలకుల పొడి వేసి మరిగించాలి. పాలు వేడి తగ్గాక పంచదార వేసి కరిగేంతదాకా కలిపి, చల్లార్చాలి. ఒక గ్లాసు పాలలో బాదం మాస్ (ఇది తాజ్ మాస్ పేరుతో మార్కెట్లో దొరుకుతుంది. చూసేందుకు క్రీం కలర్‌లో పౌడర్‌లాగా ఉంటుంది)ని వేసి, కలిపి ఆ మిశ్రమం మొత్తాన్ని పాలల్లో వేసి కలియబెట్టాలి.

రంగు సరిపోనట్లయితే.. ఆ పాలనే ఒక గ్లాసు తీసుకుని మరికొంత బాదం మాస్‌వేసి కలియబెట్టి మొత్తం పాలల్లో కలిపితే సరిపోతుంది. చివరగా ఈ మిశ్రమంలో సన్నగా తరిగిన బాదం, జీడిపప్పు వేసి.. ఫ్రిజ్‌లో ఉంచి చల్లబడ్డాక సర్వ్ చేయాలి. అంతే బాదం మిల్క్ సిద్ధమైనట్లే..! కొలెస్ట్రాల్ ఏ మాత్రం లేని బాదంపప్పును రోజుకి రెండు పిడికిళ్ల చొప్పున తింటే ఎలాంటి గుండె సంబంధ వ్యాధులు దరిచేరకుండా ఉంటాయి.