అలూ హల్వా
  • 457 Views

అలూ హల్వా

కావలసినవి:

  • ఆలు గడ్డలు: 2
  • పంచదార: ఆలుగడ్డల మొతాదు మేరకు
  • నెయ్యి: అరకప్పు
  • కేసరి రంగు: (ఇష్టపడితే కలుపుకోవచ్చు)

విధానం:

ముందుగా ఆలుగడ్డలను ఉడకబెట్టి తొక్క తీయాలి. తర్వాత దానిని గుజ్జులా చేసుకొని, ఆ గుజ్జెం త ఉన్నదో అంతే పంచదారను తీసుకోవాలి. పొయ్యి మీద నాన్‌ స్టిక్‌ పాన్‌ పెట్టి దానిలో అరకప్పు నీళ్ళు పోయాలి అవి మరిగే సమయంలో పంచదారను అందులో పొయ్యాలి. పంచదార అంతా కరిగిపోయిన తర్వాత అందులో ఆలూ గుజ్జును కలపాలి. అది హల్వాలా దగ్గర పడే వరకు చిన్న మంట మీద ఉండనివ్వాలి. తర్వాత అందులో నె య్యి పోసి హల్వా అతుక్కుపోవడం ఆపేసినప్పుడు దానిని దించేయాలి. వాసన కోసం కొంచెం ఏలుకల పొడిని కలిపి, జీడిపప్పులతో అలంకరించా లి. వడ్డనకు తియ్య తియ్యటి ఆలూ హల్వా రెడీ.