ముందుగా తురిమి పెట్టుకున్న ఆలు, ఉల్లిపాయలను కలిపి విడిగా పెట్టుకోవాలి. ఆలూను తురిమిన వెంటనే నీళ్ళలో వేస్తే రంగు మారదు. తర్వాత మైదా, ఉప్పు, మిరియాల పొడి, బేకింగ్ పౌడర్, బేకింగ్ సోడాలను కలుపుకోవాలి. అందులో కలిపి పెట్టుకున్న ఆలు, ఉల్లి తురుమును కలిపి అందులో జారుగా వచ్చేలా తగినన్ని నీళ్ళు కానీ పాలు కానీ పోసి కలుపుకోవాలి. ఎక్కువ నీరు పోయడం మంచిది కాదు. ఎందుకంటే ఆలు, ఉల్లిపాయ కూడా నీటిని విడుదల చేస్తాయి. గరిట జారుగా కలుపుకున్న పిండిని ఎక్కువగా కలపకుండా ఉంటేనే మంచిది.
తర్వాత పొయ్యి మీద తావను పెట్టి వేడెక్కిన తరువాత దానిపై కాస్త నూనె పోసి తావ అంతా అంటేలా గరిటతో తిప్పాలి. తర్వాత ఒక కపెద్ద గరిటెడు పిండిని తీసుకుని దోశలకు పోసినట్టుగా పోయాలి. అయితే ఇది పల్చగా మాత్రం ఉండకూడదు. ఎంత పెద్దది, ఎంత చిన్నది వేయాలనేది మన ఇష్టం. రెండు నిమిషాలపాటు దానిని ఉడకనిచ్చి రెండో వైపుకి తిప్పాలి. ఆ వైపు కూడా అలాగే కాలే దాకా ఉంచాలి. దీనిని టమేటో కెచప్‌తో కానీ జామ్‌తో కానీ చట్నీతో కానీ దేనితోనైనా తినవచ్చు. కొబ్బరి చట్నీ అయితే కొందరు లొట్టలేస్తారు.