కొల్హాపురీ మటన్‌ తంబడా రస్సా
  • 141 Views

కొల్హాపురీ మటన్‌ తంబడా రస్సా

కావలసినవి:

  • మటన్‌-కేజీ,
  • కారం- టేబుల్‌ స్పూను,
  • నూనె-కప్పు,
  • టొమాటోలు-రెండు,
  • ఉల్లిపాయలు- నాలుగు
  • కొత్తిమీర-కట్ట,
  • అల్లం వెల్లుల్లి పేస్టు-రెండు చెంచాలు
  • పసుపు-పావు టేబుల్‌ స్పూను
  • ఉప్పు-తగినంత,
  • నువ్వులు-రెండు టేబుల్‌ స్పూను
  • యాలకులు-నాలుగు,
  • కొబ్బరి తురుమ - రెండు టేబుల్‌ స్పూన్లు,
  • ధనియాల పొడి-టేబుల్‌ స్పూను
  • జీలకర్ర పొడి- టేబుల్‌ స్పూను,
  • మిరియాలు-ముప్పావు చెంచా,
  • దాల్చిన చెక్క-పెద్ద ముక్క,
  • లవంగాలు -నాలుగైదు,
  • గసగసాలు-టేబుల్‌ స్పూను
  • నెయ్యి-రెండు టీబుల్‌ స్పూన్లు

విధానం:

బాణలిలో నూనె లేకుండా నువ్వులు, యాలకులు, మిరియాలు, దాల్చిన చెక్క, లవంగాలూ, గసగసాలు వేయించుకోవాలి. తరువాత మెత్తగా పొడిచేసి పెట్టుకోవాలి. అలాగే టొమాటోలు, ఉల్లిపాయలు, కొత్తిమీర, తాజా కొబ్బరి తురుము, ఎండు కొబ్బరి తురుము మెత్తగా రుబ్బి పెట్టుకోవాలి. ఇప్పుడు బాణలిలో నూనె వేడి చేసి అల్లం వెల్లుల్లి పేస్టు వేయించుకోవాలి. అందులో ముందుగా వేసుకున్న మసాలా పొడి వేయాలి. తరువాత కొబ్బరి మిశ్రమం వేయాలి. పచ్చి వాసన పోయాక మటన్‌ ముక్కలు తగినంత ఉప్పు వేసి మూత పెట్టేయాలి. మటన్‌ మెత్తగా ఉడికాక ధనియాల పొడి జీలకర్ర పొడి, కారం వేసి కలిపి దింపేస్తే సరిపోతుంది. ఇది బిర్యానీ, రొట్టెల్లోకి చాలా బాగుంటుంది.