ఉసిరికాయలతో రసం
  • 117 Views

ఉసిరికాయలతో రసం

కావలసినవి:

  • ఉసిరికాయలు.. 8
  • ఎండుమిర్చి... 2
  • ఆవాలు... పావు టీ.
  • జీలకర్ర... పావు టీ.
  • వెల్లుల్లి... 5 రెబ్బలు
  • ధనియాల పొడి... ఒకటిన్నర టీ.
  • మిరియాల పొడి... పావు టీ.
  • కరివేపాకు... రెండు రెమ్మలు
  • కొత్తిమీర... ఒక కట్ట
  • ఉప్పు... తగినంత
  • పప్పు తేట...గరిటెలు

విధానం:

ఉసిరికాయలను రెండుగా విడదీసి ఆ ముక్కల్లో రెండుగ్లాసుల నీళ్లు పోసి ఉడికించి, తరవాత వడగట్టాలి. విడిగా ఓ గిన్నెను తీసుకుని కొద్దిగా నూనెవేసి ఆవాలు, జీలకర్రలతో తాలింపుపెట్టి అందులో పప్పుతేట, వడగట్టిన ఉసిరిరసం కలిపి స్టవ్‌మీద పెట్టాలి.

రసం కాస్త మరగగానే దంచిన వెల్లుల్లి, ధనియాలపొడి, మిరియాలపొడి, కొత్తిమీర, కరివేపాకు వేసి 5 నిమిషాల తరువాత దించాలి. చివరగా ఉప్పు సరిచూడాలి. ఇది అన్నంలోకి, ఇడ్లీలలోకి చాలా రుచిగా ఉంటుంది. మీరూ ట్రై చేయండి మరి.