ఉసిరి రైస్
 • 384 Views

ఉసిరి రైస్

కావలసినవి:

 • బియ్యం - పావు కేజీ
 • ఉసిరికాయలు - పది
 • పసుపు - టీ స్పూను
 • ఉప్పు - తగినంత
 • నూనె - తగినంత
 • నువ్వులపొడి - 2 టీ స్పూన్లు
 • జీడిపప్పు - 4 టీ స్పూన్లు
 • ఎండుమిర్చి - 4
 • పచ్చిమిర్చి - 4
 • కరివేపాకు - రెండు రెమ్మలు
 • కొత్తిమీర - కట్ట
 • శనగపప్పు - టీ స్పూను
 • మినప్పప్పు - టీ స్పూను
 • ఆవాలు - టీ స్పూను
 • ఇంగువ - చిటికెడు

విధానం:

అన్నం వండుకుని బౌల్‌లో ఆరబెట్టాలి. ఉసిరికాయలను చిన్న ముక్కలుగా తరిగి అందులో ఉప్పు వేసి కచ్చాపచ్చాగా దంచాలి. బాణలిలో నూనె కాగిన తరువాత పసుపు, ఎండుమిర్చి, శనగపప్పు, మినప్పప్పు, ఆవాలు వేసి వేగుతుండగా పచ్చిమిర్చి, నువ్వులపొడి, కరివేపాకు, జీడిపప్పు, దంచిన ఉసిరికాయ ముక్కలు, ఇంగువ వేసి దోరగా వేయించాలి. తరవాత దీనిని ఆరబెట్టిన అన్నంలో కలుపుకోవాలి.  tasty ఉసిరి రైస్ ready