అమృత్‌సర్ ఆలు
 • 467 Views

అమృత్‌సర్ ఆలు

కావలసినవి:

 • బంగాళదుంపలు - 150 గ్రా.
 • ఉల్లితరుగు - అరకప్పు,
 • అల్లంవె ల్లుల్లి పేస్ట్ - అర టీ స్పూన్,
 • వాము - అర టీ స్పూన్,
 • ఉప్పు - తగినంత,
 • శనగపిండి - 5 టీ స్పూన్లు,
 • ధనియాలపొడి - అర టీ స్పూన్
 • మిరప్పొడి - 2 టీ స్పూన్లు,
 • గరంమసాలా - అర టీ స్పూన్,
 • నూనె - వేయించడానికి తగినంత,
 • కొత్తిమీర - చిన్న కట్ట

విధానం:

బంగాళదుంపలను చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఒక గిన్నెలో శనగపిండి, అల్లంవెల్లుల్లిపేస్ట్, ఉప్పు, వాము వేసి బాగా కలపాలి. బంగాళదుంప ముక్కలను ఇందులో వేసి కలిపి పావుగంటసేపు నాననివ్వాలి. తరవాత ఒక బాణలిలో కొద్దిగా నూనె వేసి కాగిన తరవాత ఈ ముక్కలను అందులో వేసి గోధుమరంగువచ్చేవరకు వేయించి తీసేయాలి. తరవాత అదే బాణలిలో ఉల్లితరుగు వేసి గోధుమరంగు వచ్చేవరకు వేయించాలి. తరవాత ఉప్పు, పసుపు, మిరప్పొడి, గరంమసాలా, ధనియాలపొడి వేసి బాగా కలపాలి. తరవాత వేయించి ఉంచుకున్న బంగాళదుంప ముక్కలను ఇందులో వేసి మంటను బాగా తగ్గించి రెండు నిమిషాలు ఉంచి దించేయాలి. చివరగా కొత్తిమీరతో గార్నిష్ చేయాలి. అమృత్‌సర్ ఆలు పరాఠాలలోకి బావుంటుంది.