ఆపిల్ కేక్
  • 154 Views

ఆపిల్ కేక్

కావలసినవి:

  • కావలసిన పదార్థాలు..తొక్కతీసి చిన్న ముక్కలుగా కట్‌ చేసిన యాపిల్‌ ముక్కలు - ఐదు కప్పులు
  • చక్కెర - ఒక కప్పు
  • బ్లాక్‌ రెయిసిన్స్‌ - ఒక కప్పు
  • డ్రై ఫ్రూట్స్‌ - ఒక కప్పు
  • పీకాన్స్‌ - అరకప్పు
  • వెజిటేబుల్‌ ఆయిల్‌ - పావు కప్పు
  • వెనీలా ‚ - రెండు స్పూన్లు
  • గుడ్డు - బాగా బీట్‌ చేసినది ఒకటి
  • మిక్స్‌డ్‌ కేక్‌ ఫ్లోర్‌ - రెండున్నర కప్పులు
  • బేకింగ్‌ సోడా - ఒకటిన్నర స్పూను
  • దాల్చిన చెక్క పొడి - ఒక స్పూను

విధానం:

ఒక వెడల్పాటి గిన్నె తీసుకుని అందులో యాపిల్‌ ముక్కలు, చక్కెర, పీకాన్స్‌, రెయిసిన్స్‌ అన్నీ వేసి బాగా కలుపుకోవాలి. దీన్ని 30 నిమిషాలు పక్కన పెట్టేయాలి. ఆయిల్‌లో వెనీలా, గుడ్డు వేసి కలపాలి. పిండిలో సోడా వేసి బాగా కలపి వీటన్నిటినీ యాపిల్‌ మిశ్రమంలో కలిపేయాలి. అన్నిటినీ బాగా కలిపాలి. ముందుగా కేక్‌ పాన్‌ని వేడ చేయాలి. దానిమీద కొద్దిగా వెజిటెబుల్‌ ఆయిల్‌ని రాసుకోవాలి. తరువాత మిశ్రమాన్ని పరిచి దానిపై జీడిపప్పు వంటివి వేసుకోవచ్చు. దీన్ని 35 నుండి 40 నిమిషాల పాటు ఓవెన్‌లో పెట్టాలి. టెంపరేచర్‌ 350 ఫారన్‌ హీట్‌ వుండేలా చూసుకోవాలి. దీన్ని సర్వ్‌ చేసే ముందు ఫ్రిజ్‌లో పెట్టి కాస్త కూల్‌గా వుండేలా అందించాలి.
ఇందులో కాలరీస్‌ 18, ఫ్యాట్‌ 5 గ్రా, కొలెస్ట్రాల్‌ - 11 మిగ్రా, సోడియం 68 మిగ్రా వుంటాయి.