అరటిరైస్
 • 599 Views

అరటిరైస్

కావలసినవి:

 • అరటికాయ - ఒకటి
 • బియ్యం - కప్పు,
 • జీలకర్ర - అర టీ స్పూను,
 • ఆవాలు - అర టీ స్పూను
 • శనగపప్పు - టీ స్పూను
 • పల్లీలు - 50 గ్రా.,
 • ఎండుమిర్చి - 6
 • కరివేపాకు - రెండు రెమ్మలు
 • పచ్చిమిర్చి తరుగు - రెండు టీ స్పూన్లు
 • ఉప్పు - తగినంత,
 • కొత్తిమీర - ఒక కట్ట
 • జీడిపప్పు - 50 గ్రా.,
 • నిమ్మకాయ - 1
 • నూనె - 5 టీ స్పూన్లు,
 • పసుపు - తగినంత

విధానం:

ముందుగా పొడిపొడిలాడేలా అన్నం వండి పక్కన ఉంచుకోవాలి. అరటికాయ చెక్కు తీసి, ముక్కలుగా కట్ చేసి, మూడు టీ స్పూన్ల నూనెలో వేయించి తీసి పక్కన పెట్టాలి. తరవాత స్టౌ మీద బాణలి పెట్టి, నూనె వేసి కాగిన తరవాత అందులో ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, ఎండుమిర్చి, కరివేపాకు వేసి వేయించి పక్కనుంచుకోవాలి. పెద్ద పాత్రలోకి అన్నం తీసుకుని అందులో వేయించిపెట్టుకున్న పదార్థాలను వేసి బాగా కలపాలి. తరవాత జీడిపప్పు, వేయించిన పల్లీలు, పచ్చిమిర్చి, పసుపు, ఉప్పు, నిమ్మరసం వేసి బాగా కలపాలి. చివరగా కొత్తిమీరతో గార్నిష్ చేయాలి.