అరిసెలు
  • 745 Views

అరిసెలు

కావలసినవి:

  • బియ్యం - కేజీ,
  • బెల్లం - ముప్పావుకేజీ
  • నువ్వులు - 100 గ్రాములు
  • నెయ్యి - 1 కప్పు
  • నూనె - వేయించడానికి సరిపడా

విధానం:

బియ్యం రాత్రి నానబెట్టుకోవాలి. ఉదయం బియ్యంలో నీళ్లన్నీ వంపి పిండి పట్టించుకోవాలి (కొట్టిన పిండైతే బాగుంటుంది). ఈ పిండి తడారిపోకుండా చూసుకోవాలి. బెల్లం పొడి చేసి అందులో కొద్దిగా నీళ్లు పోసి ముదురు పాకం పట్టుకోవాలి. పాకం రాగానే అందులో నువ్వులు కలపాలి. వెంటనే స్టౌమీద నుండి దింపి అందులో బియ్యం పిండి కలపాలి. పిండి కలిపేటప్పుడు ఉండలు కట్టకుండా జాగ్రత్తగా కలపాలి. అందులోనే నెయ్యివేసి కలపాలి. పిండిని చిన్న చిన్న ఉండలు చేసి ప్లాస్టిక్‌ కవర్‌ మీద అరిసెల్లా వత్తుకోవాలి. వీటిని కాగిన నూనెలో వేసి బంగారు రంగు వచ్చేవరకు వేయించాలి. బయటికి తీసి అరిసెల గంటెలతో నూనె వత్తుకుని కొద్దిగా ఆరబెట్టాలి. అంతే పిన్నా పెద్దా అందరూ ఇష్టపడే అరిసెలు రెడీ.