అడుగు మందంగా ఉన్న బాణలిని ఒకమాదిరి మంటపై పెట్టి నెయ్యి కరిగించాలి. అందులో జీడిపప్పు, కిస్మిస్లు వేసి బంగా రు రంగు వచ్చేవరకు సుమారు ఐదు నిమిషాల పాటు వేయించా లి. తర్వాత వాటిని తీసి పక్కన పెట్టుకోవాలి. అనంతరం గోధు మ పిండిని నేతిలో వేసి పది ని మిషాల పాటు బంగారు రంగు లోకి వచ్చే వరకు వేయించాలి. పక్కనే మరో పొయ్యి మీద మం దపాటి అడుగున్న గిన్నెలో నీళ్ళు పోసి చక్కెర వేసి అది కరిగి పాకమయ్యేలా తిప్పాలి. ఇలాచీ పొడిని పాకం లో వేసి నెమ్మదిగా దా నిని వేగిన పిండి మీద పోయాలి. పాకం వేసేటప్పుడు పిండి ఉండలు కట్టకుండా తిప్పుతూ ఉండాలి. బాణలి పక్కల నుంచి హల్వా ఊడి వచ్చే వరకూ ఉ డికించాలి. తర్వాత ఒక ప్లేట్ తీసుకుని దానికి నెయ్యి రాసి అందులో ఈ హల్వాను పరచాలి. దానిపై వేయించి పెట్టుకున్న జీడిపప్పు, కిస్మిస్లు జల్లాలి. ముక్కలుగా కట్ చేసి సర్వ్ వేడిగా అయినా సర్వ్ చేయవచ్చు లేదా చల్లబడే దాకా ఉంచి తినవచ్చు. ఎలా తిన్నా రుచి మాత్రం మధురం.