కడాయిలో నూనె పోసి అందులో అటుకులను లేత దోరగా వేయించి పక్కన బెట్టుకోవాలి. మరో పాత్రలో పాలు కాచి అందులో కుంకుమ చేర్చి, ఇందులో వేయించిన అటుకుల్ని వేసి కలపాలి. అటుకుల కాస్త ఉడికాక పంచదార, నెయ్యి చేర్చి కలియబెడుతూ ఉండాలి. జీడిపప్పు, బాదం, పిస్తాలను నేతిలో వేపి హల్వాతో చేర్చి, చివరిగా ఏలకుల పొడి చల్లి దించేయాలి.