బేబీకార్న్‌ మంచూరియా
 • 411 Views

బేబీకార్న్‌ మంచూరియా

కావలసినవి:

 • బేబీకార్న్‌ - ఐదుమొక్కజొన్న పిండి - అర కప్పు
 • బియ్యం పిండి - పావు కప్పు
 • కారం - కొద్దిగా
 • అల్లంవెల్లుల్లి ముద్ద - చెంచా
 • ఉప్పు - తగినంత
 • నూనె - వేయించడానికి సరిపడినంత
 • ఉల్లిపొరక - కట్ట (సన్నగా తరగాలి)
 • ఉల్లిపాయ - ఒకటి (సన్నగా తరగాలి)
 • వెల్లుల్లి పలుకులు,
 • సోయా టొమాటో సాస్‌ - ఒక్కొక్కటి చెంచా చొప్పున తీసుకోవాలి

విధానం:

బేబీకార్న్‌ను ఒకే సైజులో తరిగి, ఉప్పు నీటిలో ఉడికించాలి. ఇప్పుడు మొక్కజొన్న, బియ్యం పిండి, కారం, అల్లం వెల్లుల్లి ము ద్ద, కొద్దిగా ఉప్పు వేసి మరో పాత్రలో బజ్జీలపిండిలా కలపాలి. ఇందులో ఉడికించిన బేబీకార్న్‌ను ముంచి బజ్జీల మాదిరి వేయిం చాలి. బాణలిలో కాస్త నూనె వేడిచేసి అందులో వెల్లుల్లి పలుకు లు, ఉల్లిపాయ, ఉల్లిపొరక ముక్కలు ఎర్రగా వేగనివ్వాలి. ఇందు లో వేయించి పెట్టుకున్న బేబీకార్న్‌ ముక్కల్లి ఒక్కోటి చొప్పున ఉంచాలి. పైన సోయా, చిల్లీసాస్‌, టొమాటో సాస్‌, ఇంకాస్త ఉప్పు చల్లితే వేడి వేడి బేబీకార్న్‌ మంచూరియా రెడీ...