బేబీకార్న్‌ కాప్సికమ్‌ కూర
  • 197 Views

బేబీకార్న్‌ కాప్సికమ్‌ కూర

కావలసినవి:

  • బేబీకార్న్‌ - 10,
  • క్యాప్సికమ్‌ - 2
  • టమాటాలు - 2,
  • ఉల్లిపాయలు - 2
  • జీలకర్ర - అర స్పూన్‌
  • అల్లం వెల్లుల్లి పేస్ట్‌ - 1 టీ స్పూన్‌
  • కారం - 1 స్పూన్‌,
  • జీడిపప్పు - 10
  • ధనియాల పొడి - 1 టీ స్పూన్‌
  • గరంమసాలా - అర టీ స్పూన్‌
  • మెంతి ఆకు - కొద్దిగా,
  • పాలమీగడ - 2 టీ స్పూన్లు
  • పసుపు - పావు టీ స్పూన్‌,
  • కొత్తిమీర తరుగు - కొద్దిగా
  • నూనె - 1 టేబుల్‌ స్పూన్‌,
  • ఉప్పు - తగినంత

విధానం:

కూరగాయల్ని తరిగి పెట్టుకోవాలి. జీడిపప్పు వేడి నీళ్లలో కొద్దిసేపు నానబెట్టి పేస్ట్‌లా రుబ్బుకోవాలి. బాండీలో నూనె కాగాక జీలకర్ర, ఉల్లి ముక్కలు, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్‌ వేయించాలి. అందులోనే టమాటా ముక్కలు వేయాలి. రెండు నిమిషాల తర్వాత ఉప్పు, కారం, ధనియాల పొడి, గరం మసాలా కలపాలి. క్యాప్సికమ్‌, బేబీకార్న్‌ ముక్కలు వేసి అరకప్పు నీళ్లు పొయ్యాలి. పది నిమిషాల తర్వాత జీడిపప్పు పేస్ట్‌, మెంతి ఆకు కలిపి మరో ఐదు నిమిషాలు ఉడికించాలి. దించే ముందు పాలమీగడ, కొత్తిమీర వేసుకుంటే చాలు. బేబీకార్న్‌ క్యాప్సికమ్‌ కూర రెడీ. ఇది పరోటాల్లోకి చాలా బాగుంటుంది.