వంకాయలకు కొద్దిగా నూనె రాసి స్టౌ మీద పెట్టి కాల్చుకోవాలి.చల్లారిన తరవాత పైన పొట్టు తీసి, (పురుగులున్నాయేమో చూసి) మెత్తగా చేతితో మెదపాలి. పచ్చిమిర్చి, ఉప్పు, చింతపండు కలిపి మిక్సీ పట్టాలి.
వంకాయ గుజ్జును వేసి మరీ మెత్తగా కాకుండా మిక్సీ పట్టి తీసేయాలి. బాణలిలో నూనె వేసి కాగాక పోపు సామాను ఒక్కటొక్కటిగా వేస్తూ దోరగా వేయించి, చల్లారాక పచ్చడిలో కలపాలి.ఉల్లితరుగు, కరివేపాకు, నువ్వులపొడి వేసి కలపాలి.సర్వింగ్ బౌల్లోకి తీసుకుని కొత్తిమీరతో గార్నిష్ చేయాలి.