అరటి 65
  • 464 Views

అరటి 65

కావలసినవి:

  • అరటికాయ - ఒకటి,
  • మైదా - టీ స్పూను,
  • కార్న్‌ఫ్లోర్ - టీ స్పూను
  • శనగపిండి - టీ స్పూను,
  • ఉప్పు - తగినంత,
  • కారం - అర టీ స్పూను
  • పసుపు - అర టీ స్పూను,
  • పచ్చిమిర్చితరుగు - 4,
  • ఉల్లితరుగు - అర కప్పు
  • కరివేపాకు - నాలుగు రెమ్మలు,
  • అల్లంవెల్లుల్లి ముద్ద - అర టీ స్పూను
  • నూనె - పావు కిలో,
  • పెరుగు - అర కప్పు,
  • నీరు - తగినంత

విధానం:

ముందుగా అరటికాయ చెక్కు తీసి చిన్న ముక్కలుగా కట్ చేసుకువాలి. (తరిగిన ఈ ముక్కలను మజ్జిగ కలిపిన నీటిలో వేస్తే నల్లబడకుండా ఉంటాయి). స్టౌ మీద బాణలి పెట్టి, అందులో నూనె పోసి వేడి చేయాలి. నూనె కాగేలోపుగా... ఒక బౌల్ తీసుకుని అందులో మైదా, కార్న్‌ఫ్లోర్, శనగపిండి, కారం, పసుపు, ఉప్పు వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమంలో తరిగి ఉంచుకున్న అరటికాయ ముక్కలను కలపాలి. వీటిని పకోడీల మాదిరిగా నూనెలో వేసి వేయించాలి. అలా వేయించిన వాటిని పక్కన పెట్టుకోవాలి. మరొక బాణలిలో నాలుగు స్పూన్ల నూనె వేసి కొద్దిగా వేడయ్యాక ఉల్లితరుగు, అల్లంవెల్లుల్లి ముద్ద, పచ్చిమిర్చి తరుగు, కరివేపాకు వేసి వేయించాలి. బాగా వేగాక అందులో ఒక కప్పు పెరుగు, తగినంత నీరు పోయాలి. నీరు బాగా దగ్గరపడిన తరవాత అందులో పక్కన పెట్టుకున్న బజ్జీలను వేసి కలిపి ఐదు నిముషాల తరవాత దింపేయాలి. చివరగా కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవాలి.