అరటికాయ పచ్చడి
 • 484 Views

అరటికాయ పచ్చడి

కావలసినవి:

 • అరటికాయలు (పచ్చివి) - 2
 • పచ్చిమిర్చి - 4, ఎండుమిర్చి - 6
 • ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు - 2 టీ స్పూన్ల చొప్పున,
 • పచ్చిశనగపప్పు - టీ స్పూను
 • కొత్తిమీర - కొద్దిగా
 • కరివేపాకు - రెండు రెమ్మలు
 • ఉప్పు - తగినంత, పసుపు - చిటికెడు
 • ఇంగువ - కొద్దిగా
 • నానబెట్టిన చింతపండు - కొద్దిగా
 • పల్లీలపొడి - మూడు టీ స్పూన్లు

విధానం:

అరటికాయలను స్టౌ మీద కాల్చాలి. చల్లారిన తరువాత పైన ఉన్న పొట్టును తీసి ముక్కలు చేసుకోవాలి. బాణలిలో నూనె వేసి కాగాక, శనగపప్పు, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర వేసి వేయించి చివర్లో ఎండుమిర్చి, పచ్చిమిర్చి వేసి మరో మారు వేయించాలి. చల్లారిన తరువాత మిక్సీలో వేసి తిప్పాలి. మెత్తగా అయ్యాక ఉప్పు, చింతపండు, అరటికాయముక్కలు వేసి తిప్పాలి. పచ్చడిని బౌల్‌లోకి తీసుకుని, పల్లీలపొడి వేసి కలిపి, కొత్తిమీర, కరివేపాకులతో గార్నిష్ చేయాలి.