అరటి కబాబ్
  • 369 Views

అరటి కబాబ్

కావలసినవి:

  • అరటికాయలు-మూడు,
  • ఉల్లిపాయ-ఒకటి
  • పచ్చిమిర్చి-మూడు,
  • అల్లం-చిన్నముక్క
  • ఉప్పు, కారం-తగినంత,
  • పసుపు-చిటికెడు,
  • జీలకర్ర, ధనియాలపొడి-అరచెంచా
  • గరంమసాలా-చెంచా
  • మొక్కజొన్న పిండి-రెండు చెంచాలు
  • నిమ్మరసం -చెంచా,
  • కొత్తిమీర-కొద్దిగా
  • నూనె-కొద్దిగా

విధానం:

అరటికాయలను బాగా ఉడికించి, పొట్టుతీసి మెత్తగా మెదపాలి. ఉల్లిపాయ, పచ్చిమిర్చిని తరిగి పెట్టుకోవాలి. గిన్నెలో నూనె వేడయ్యాక అరటి ముద్ద దాన్లో వేయాలి. నిమ్మరసం తప్ప మిగిలిన పదార్థాలు కూడా వేసేసి కలియతిప్పాలి. ఆఖర్న నిమ్మరసం చల్లి పొయ్యి కట్టేయాలి. ఈ మిశ్రమం చల్లారాక బాణలిలో నచ్చిన ఆకృతిలో చేసుకుని వేయించుకొంటే కబాబ్‌లు సిద్ధం.