బనానా, ఓట్‌మీల్ అండ్ వాల్‌నట్ కేక్
 • 531 Views

బనానా, ఓట్‌మీల్ అండ్ వాల్‌నట్ కేక్

కావలసినవి:

 • మైదా: ఒకటింపావు కప్పు;
 •  బ్రౌన్ షుగర్: అర కప్పు;
 • ఉప్పు: అర టీ స్పూన్;
 •  బేకింగ్ సోడా: కొద్దిగా;
 • బేకింగ్ పౌడర్: పావు టీ స్పూన్;
 •  కోడిగుడ్లు :3 (మీడియం సైజు);
 •  నూనె: 3 టీస్పూన్లు;
 • బాగా మగ్గిన అరటిపళ్ళు: 3 (పెద్దవి);
 •  ఓట్స్: కప్పు (వండనివి);
 • వాల్‌నట్స్: కప్పు.

విధానం:

ముందుగా అవెన్‌ను 350 డిగ్రీలకు ప్రీ ీహ ట్ చేసుకోవాలి. ఒక పాత్రలో పొడి పదార్ధాలన్నీ జల్లించి, తరవాత బ్రౌన్ షుగర్ కలపాలి. మరో పాత్రలో గిలక్కొట్టిన గుడ్లలో నూనె వేసి బాగా కలిపి ఇందులో పొడి పదార్థాల మిశ్రమం వే సి కలుపుకోవాలి. మరో పాత్రలో అరటిపళ్ళను మెత్తగా గుజ్జులాగా మెదుపుకుని, అందులో ఓట్ మీల్, వాల్‌నట్స్ వేసి కలపాలి. ఈ మిశ్రమాన్ని నూనె రాసిన బేకింగ్ ట్రేలో వేసి అవెన్‌లో పెట్టి45-50 నిముషాల పాటు బేక్‌చేయాలి.

టిప్:
అరటి పండులో పొటాషియమ్ సమృద్దిగా ఉంటుంది, వాలనట్స్ బ్రెయిన్ డెవెలప్‌మెంట్‌కి ఎంతో మంచివి. ఈ కేక్‌ను స్ట్రా బెర్రీస్, కిస్‌మిస్‌తో కూడా వెరైటీగా తయారు చేసుకోవచ్చు.