బనానా ఆరెంజ్ జూసు
  • 428 Views

బనానా ఆరెంజ్ జూసు

కావలసినవి:

  • ఆరెంజ్ జ్యూస్... రెండు కప్పులు
  • వెన్నతీసిన పాలు.. రెండు కప్పులు
  • అరటిపండ్లు.. నాలుగు
  • తేనె.. ఎనిమిది టీస్పూన్లు

విధానం:

ఆరెంజ్ జ్యూస్, పాలు, అరటిపండ్ల ముక్కలను మిక్సీలో వేసి బ్లెండ్ చేయాలి. ఈ మిశ్రమాన్ని పాత్రలో పోసి ఫ్రిజ్‌లో ఉంచాలి. బాగా చల్లబడిన తరువాత తీసి జ్యూస్ గ్లాసులలో ఈ మిశ్రమాన్ని నింపి, పైన ఒక్కోదాంట్లో రెండు టీస్పూన్ల తేనెను వేసి అతిథులకు సర్వ్ చేయాలి. బనానా ఆరెంజ్ ఫ్రీజ్ జ్యూస్ తయార్..!
అరటి, కమలాపండ్లతో తయారు చేసిన ఈ బనానా ఆరెంజ్ ఫ్రీజ్ జ్యూస్ కొత్త రుచితో అలరించటమేగాకుండా.. తక్షణ శక్తిని ఇస్తుంది. వేసవితాపాన్ని చల్లారుస్తుంది, వడదెబ్బనుంచి కాపాడుతుంది. హాట్‌ హాట్ సమ్మర్‌ను, కూల్ కూల్‌ చేసేస్తుంది. ఇంకా ఎందుకు ఆలస్యం.. మీరూ ట్రై చేస్తారు కదూ..?!