అరటి పకోడి
 • 323 Views

అరటి పకోడి

కావలసినవి:

 • అరటికాయ - ఒకటి
 • శనగపిండి - 100 గ్రా.,
 • పసుపు - అర టీ స్పూను
 • కారంపొడి - అర టీ స్పూను
 • ధనియాలపొడి-అర టీ స్పూను
 • ఉప్పు - తగినంత,
 • నీరు - తగినంత
 • అల్లం వెల్లుల్లి ముద్ద- అర టీ స్పూను
 • పచ్చిమిర్చి - 6
 • కరివేపాకు - రెండు రెమ్మలు,
 • నూనె - 250 గ్రా.

విధానం:

ముందుగా అరటికాయ చెక్కు తీసి తురుముకోవాలి. ఒక గిన్నెలో పైన చెప్పిన పదార్థాలను (నూనె కాకుండా) వేసి బాగా కలపాలి. అందులో అరటి తురుము వేసి బాగా కలపాలి. బాణలిలో నూనె పోసి స్టౌ మీద ఉంచాలి. నూనె వేడయ్యాక అందులో ఈ మిశ్రమాన్ని పకోడీల మాదిరిగా వేయించుకోవాలి. వీటిని పేపర్ మీదకు తీసుకుని, వేడివేడిగా సర్వ్ చేయాలి.