బెంగళూరు వంకాయలను స్టౌ మీద కాల్చి, చల్లారాక పొట్టు తీసి చిన్నచిన్న ముక్కలుగా తరగాలి. పచ్చిమిర్చి, ఉప్పు వేసి మిక్సీ తిప్పాలి. చల్లారిన బెంగళూరు వంకాయ ముక్కలను కూడా మిక్సీలో వేసి తిప్పాలి. బౌల్లోకి తీసుకుని వేయించిన పోపు ను వేసి బాగా కలపాలి. నిమ్మరసం, ఉల్లితరుగు వేసి కలపాలి. కొత్తిమీరతో గార్నిష్చేయాలి.