గోంగూర చికెన్ బిర్యానీ
 • 1182 Views

గోంగూర చికెన్ బిర్యానీ

కావలసినవి:

 • బియ్యం.. రెండు కేజీలు
 • గోంగూర.. రెండు కట్టలు
 • పెరుగు.. 4 కప్పులు
 • పచ్చిమిర్చి.. 30 గ్రా.
 • డాల్డా.. 300 గ్రా.
 • దాల్చిన చెక్క.. 50 గ్రా.
 • చికెన్.. ఒక కేజీ
 • అల్లంవెల్లుల్లి పేస్ట్.. 60 గ్రా.
 • మిర్చిపౌడర్.. 4 టీ.
 • పుదీనా.. 2 కట్టలు
 • ఉల్లిముక్కలు.. 60 గ్రా.
 • ఉప్పు.. తగినంత
 • లవంగాలు.. 4
 • సాజీరా.. 2 టీ.
 • యాలకులు.. 4

విధానం:

బియ్యం కడిగి అరగంటసేపు నానబెట్టాలి. గిన్నెలో డాల్డా వేసి వేడయిన తరువాత లవంగాలు, సాజీరా, యాలకులు, దాల్చిన చెక్క నిలువుగా తరిగిన మిర్చి, ఉల్లిముక్కల్ని వేసి దోరగా వేయించాలి. అల్లంవెల్లుల్లి పేస్ట్, పసుపు, పుదీనా వేసి 2 నిమిషాల తరువాత గోంగూర వేయాలి.

పెరుగు, చికెన్, మిర్చిపొడి, ఉప్పు వరుసగా వేసి, సన్నటి సెగపై ఉడికించాలి. మరో గిన్నెలో ఎసరు మరిగించి అందులో నానబెట్టిన బియ్యం వేయాలి. అన్నం సగం ఉడికిన తరువాత దాన్ని వార్చి చికెన్ మసాలాలు ఉడుకుతున్న గిన్నెలోకి వేయాలి. ఆవిరి పోకుండా ఉండేలా నిండుగా మూతపెట్టి, ఆ తర్వాత సన్నటి సెగపై 20 నిమిషాలు మగ్గించాలి. అంతే వేడి వేడి గోంగూర చికెన్ బిర్యానీ తయార్..!!