గోంగూర పుల్లకూర
 • 366 Views

గోంగూర పుల్లకూర

కావలసినవి:

 • గోంగూర - 5 కట్టలు,
 • పచ్చి శనగపప్పు - 20 గ్రా
 • ఉల్లిపాయలు - 1(తరగాలి),
 • పచ్చిమిర్చి- 3,
 • ఎండు మిర్చి- 2,
 • మెంతిపొడి- ఒక టేబుల్ స్పూన్
 • మినప్పప్పు- 5 గ్రా,
 • జీలకర్ర- ఒక టీ స్పూన్,
 • ఆవాలు - ఒక టీ స్పూన్,
 • పసుపు - పావు టీ స్పూన్,
 • ఇంగువ - పావు టీ స్పూన్,
 • వెల్లుల్లి- ఐదు పాయలు,
 • నూనె - 3 టేబుల్ స్పూన్లు,
 • ఉప్పు, కారం- తగినంత

విధానం:

గోంగూరను ఒలిచి శుభ్రం చేయాలి. శనగపప్పును విడిగా ఉడికించి పక్కన ఉంచాలి. బాణలిలో నూనె వేసి మినప్పప్పు, జీలకర్ర, ఆవాలు, పసుపు, ఇంగువ, ఎండుమిర్చి, మెంతులు, వెల్లుల్లి వేసి వేయించాలి. ఆవాలు వేగిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి వేయాలి. అవి వేగిన తర్వాత గోంగూర వేసి కొద్దిగా నీటిని వేసి మూతపెట్టి ఐదు నిమిషాల సేపు ఉడికించాలి. ఇప్పుడు ఉడికించిన శనగపప్పు, ఉప్పు, కారం వేసి కలిపి మరో ఐదు నిమిషాల సేపు చిన్న మంట మీద ఉడికించి దించాలి.  గోంగూర పుల్లకూర.