ముందుగా గోంగూరను వలిచి శుభ్రం చేసుకోవాలి. శనగపప్పు విడిగా ఉడికించి పక్కన పెట్టుకోవాలి. స్టౌపై బణలి పెట్టి అందులో నూనె వేసి మినప్పప్పు, జీలకర్ర, ఆవాలు, పసుపు, ఇంగువ, ఎండుమిర్చి, మెంతులు, వెల్లుల్లి వోసి వేయించాలి. ఆవాలు వేగిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు దోరగా వేయించుకోవాలి.
వేగిన తర్వాత గోంగూర వేసి కొద్దిగా నీటిని పోసి మూత పెట్టి ఐదు నిమిషాల పాటు ఉడికించాలి. గోంగూర బాగా ఉడికిన తర్వాత ముందుగా ఉడికించి పెట్టుకున్న శెనగపప్పు, ఉప్పు, కారం వేసి బాగా కలిపి మరో ఐదు నిమిషాల సన్నటి సెగపై ఉడికించి దించేయాలి. వేడి వేడి మటన్ బిర్యానీలోకి ఈ పుల్లటి గోంగూర వేసుకొని తింటే ఆ టేస్టే వేరు.