ఒక వెడల్పాటి పాత్రలో గోధుమపిండి , కారం, ఉప్పు, నువ్వులు, జీలకర్ర, నెయ్యి, కొత్తిమీర, పచ్చిమిర్చి పేస్ట్, చిక్కుడుకాయ పేస్ట్ వేసి చపాతీపిండిలా కలిపి (అవసరమైతే నీళ్లు వేసుకోవాలి), చివరగా టీ స్పూను నూనె వేసి మరోమారు బాగా కలిపి మూత పెట్టి అరగంట సేపు నాననివ్వాలి. తరవాత పిండిని పెద్దపెద్ద ఉండలుగా చేసుకుని, ఒక్కొక్కదానిని పరోఠా మాదిరిగా ఒత్తుకోవాలి. స్టౌ మీద పెనం పెట్టి బాగా వేడయ్యాక పరోఠాలను నూనె లేదా నెయ్యి వేసి రెండువైపులా కాల్చాలి. ఇవి పెరుగు లేదా వెన్నతో తింటే బావుంటాయి.