చిక్కుడు చెక్కలు
  • 333 Views

చిక్కుడు చెక్కలు

కావలసినవి:

  • ఉడికించిన చిక్కుడుకాయ ముక్కలు - అర కప్పు
  • బియ్యప్పిండి - ఒకటిన్నర కప్పు,
  • పచ్చిమిర్చి పేస్ట్ - తగినంత
  • అల్లం వెల్లుల్లి పేస్ట్ - టీస్పూను,
  • ఉప్పు - తగినంత
  • సోడా - తగినంత,
  • నెయ్యి - 2 టీస్పూన్లు
  • నువ్వులు, జీలకర్ర - కొద్దికొద్దిగా,
  • నూనె - వేయించడానికి సరిపడా

విధానం:

ఉడికించిన చిక్కుడుకాయ ముక్కలు చల్లారాక మిక్సీలో వేసి మెత్తగా చే సుకుని పక్కన ఉంచుకోవాలి. ఒక గిన్నె తీసుకుని అందులో బియ్యప్పిండి, గ్రైండ్ చేసిన చిక్కుడుకాయముక్కలు, మిగతా పదార్థాలు (నూనె తప్ప) అన్నీ వేసి బాగా కలిపి నీళ్లు అద్దుకుంటూ చపాతీపిండిలా ముద్దలా చేసి పక్కన పెట్టుకోవాలి. అరగంట తరవాత ఆ పిండిని నిమ్మకాయ సైజులో ఉండలుగా చేసుకుని పక్కన ఉంచుకోవాలి. ప్లాస్టిక్ కవరుకు నూనె రాసి దాని మీద ఈ ఉండను పెట్టి వెడల్పుగా ఒత్తి కాగిన నూనెలో వేసి బంగారురంగు వచ్చేవరకు వేయించి తీసేయాలి. చల్లారిన తరవాత డబ్బాలో పెట్టుకోవాలి. కరకరలాడుతూ రుచిగా ఉంటాయి. ఇవి నాలుగైదు రోజులు నిల్వ ఉంటాయి.