బీన్స్‌ను నాలుగైదు గంటలపాటు నానబెట్టాలి. తరువాత నీళ్లు ఒంపేసి గ్రైండర్లో వేసి కొద్దిగా నీళ్లు జతచేసి మెత్తగా రుబ్బుకోవాలి. ఈ మిశ్రమంలో ఉల్లిపాయ, పచ్చిమిర్చి ముక్కలు, సన్నగా తరిగిన కరివేపాకు, కొత్తిమీర, అల్లం, వెల్లుల్లి పేస్ట్, ఉప్పు వేసి బాగా కలపాలి. కావాలనుకుంటే అరచెంచా గరం మసాలా పొడి కూడా వేసుకోవచ్చు. దీనిని ఉండలుగా చేసుకుని వెడల్పుగా ఒత్తుకోవాలి. వీటిని నూనెలో డీప్ ఫ్రై చేసుకోవాలి.