బీట్‌ రూట్‌ చట్నీ
  • 327 Views

బీట్‌ రూట్‌ చట్నీ

కావలసినవి:

  • చింతపండు-కొద్దిగా,
  • పసుపు-చిటికెడు,
  • ఎండు మిరపకాయలు-10,
  • ఆవాలు-చెంచా,
  • మెంతులు-కొద్దిగా,
  • ఇంగువ-కొద్దిగా,
  • మినప్పప్పు-చెంచా,
  • ఉప్పు-తగినంత,
  • కరివేపాకు-ఒక రెమ్మ,
  • నూనె-50 గ్రాములు

విధానం:

ముందుగా బాణలిలో రెండు టీ స్పూన్ల నూనె వేసి వెచ్చబడ్డాక ఆవాలు, మెంతులు, ఎండు మిరపకాయలు, ఇంగువతో తాలింపు వేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు సన్నగా తురిమి పెట్టుకున్న బీట్‌ రూట్‌ని పచ్చి వాసన పోయేదాక నూనెలో వేయించాలి. ఇది చల్లారిన తర్వాత మిక్సీలో వేసుకుని అందులో తగినంత ఉప్పు, చిటికెడు పసుపు, నానబెట్టిన చింతపండు గుజ్జు, ఇంతకు ముందు వేయించి ఉంచిన తాలింపు మొత్తం వేసి రుబ్బాలి. ఈ పచ్చడిని ఒక కప్పులోకి తీసుకుని దానికి కొద్దిగా మినప్పప్పు, ఆవాలు, కరివేపాకుతో తాలింపు వేసి కలుపుకోవాలి. ఈ చట్నీ వేడి వేడి అన్నంలోకి చపాతీ పూరీల్లోకి చాలా రుచిగా ఉంటుంది.