బీట్‌రూట్ ఐస్‌క్రీమ్
  • 472 Views

బీట్‌రూట్ ఐస్‌క్రీమ్

కావలసినవి:

  • మిల్క్ పౌడర్... అర కప్పు
  • క్రీమ్... ఒకటిన్నర కప్పు
  • బీట్ రూట్... రెండు కప్పులు
  • కార్న్‌ఫ్లోర్... రెండు టీ స్పూన్లు
  • పంచదార... అర కప్పు
  • వెనిల్లా ఎసెన్స్... ఒక టీస్పూన్
  • పాలు... ఒక కప్పు
  • బటర్... రెండు టీస్పూన్లు

విధానం:

కార్న్‌ఫోర్ల్‌ను పాలతో ఉడికించి, చల్లార్చి... మిల్క్ పౌడర్, చక్కెర, వెన్నలతో కలిపి మిక్సీలో కొట్టి పక్కన ఉంచుకోవాలి. అలాగే వెనిల్లా ఎసెన్స్, క్రీమ్‌లను కూడా మిక్సిలో కొట్టి ఉంచాలి. మిక్సీలో రుబ్బుకున్న ఈ రెండు మిశ్రమాలను ఒక పాత్రలో వేసి బాగా కలిపి, ఫ్రిజ్‌లో ఉంచితే ఐస్‌క్రీమ్ మిశ్రమం తయారవుతుంది.

ఇప్పుడు బీట్‌రూట్, చక్కెరలను కలిపి ఉడికించి, చక్కెర కరిగాక చల్లార్చి అందులో ఐస్‌క్రీమ్ మిశ్రమాన్ని కలిపి అరగంట పాటు ఫ్రిజ్‌లో ఉంచితే బీట్‌‌‌‌రూట్ ఐస్‌క్రీమ్ రెడీ అయినట్లే...! ఈ ఐస్‌క్రీమ్‌పై నచ్చిన పండ్ల ముక్కలతో అలంకరించి అతిథులకు సర్వ్ చేయండి.