బీట్‌రూట్ కుర్మా
  • 250 Views

బీట్‌రూట్ కుర్మా

కావలసినవి:

  • బీట్‌రూట్ ముక్కలు - ఒక కప్పు
  • ఉల్లితరుగు - అర కప్పు;
  • పచ్చికొబ్బరి లేదా ఎండుకొబ్బరి - 2 టేబుల్ స్పూన్లు;
  • పల్లీలు లేదా జీడిపప్పు - 2 టేబుల్‌స్పూన్లు;
  • వెల్లుల్లి రెమ్మలు - 4;
  • అల్లం - చిన్నముక్క;
  • జీలకర్ర - టీ స్పూను;
  • నూనె - టేబుల్ స్పూను;
  • ఉప్పు, కారం - తగినంత,
  • కొత్తిమీర - కొద్దిగా

విధానం:

బీట్‌రూట్ ముక్కలను కుకర్‌లో మూడు విజిల్స్ వచ్చేవరకు ఉడికించుకోవాలి. కొబ్బరి, జీడిపప్పు, వెల్లుల్లి, అల్లం, కొద్దిగా నీరు కలిపి గ్రైండ్ చేసుకోవాలి. ఒక బాణలిలో నూనె వేడి చేసి, జీలకర్ర వేసి చిటపటలాడాక, సన్నగా తరిగిన ఉల్లితరుగు వేసి వేయించాలి. తరువాత గ్రైండ్ చేసిన మిశ్రమం కూడా వేసి కొద్దిగా నీళ్లు పోసి కాసేపు ఉడికించాలి. చివరగా బీట్‌రూట్, ఉప్పు, కారం, కొత్తిమీర కూడా వేసి రెండు నిముషాలు ఉడికించి దించేయాలి. బీట్‌రూట్ కుర్మా (beetroot kurma) చపాతీలలోకి, బిరియానీలోకి రుచిగా ఉంటుంది.