బీట్‌రూల్‌ రైతా
  • 384 Views

బీట్‌రూల్‌ రైతా

కావలసినవి:

  • బీట్‌రూట్లు: 2
  • పెరుగు: 3 కప్పులు
  • వేయించిన జీలకర్ర పొడి:
  • 1 టీ స్పూన్‌
  • కారం: 1 టీ స్పూన్‌
  • ఉప్పు: తగినంత
  • పుదీనా ఆకులు: గార్నిషింగ్‌కి సరిపడా

విధానం:

బీట్‌ రూట్‌ను కడిగి ఉడక పెట్టాలి. తర్వాత దానిపై చర్మాన్ని వలిచి, చల్ల బడ్డాక చిన్న ముక్కలుగా కోసుకోవాలి. వాటిని పక్కన పెట్టాలి. ఒక బౌల్‌లో పెరుగు తీసుకుని దానిని చిక్కగా చిలకాలి. చిలగ్గొట్టిన పెరుగులో బీట్‌రూట్లు, వేయించిన జీలకర్ర పొడి, కారం, ఉప్పు వేసి బాగా కలపాలి. దానిపై పుదీనా ఆకులు వేసి గార్నిషింగ్‌ చేయాలి. దీనిని చపాతీలు, రొట్టెలలోకే కాదు అన్నంలోకి కూడా తీసుకోవచ్చు.