బెండకాయ దప్పళం
 • 637 Views

బెండకాయ దప్పళం

కావలసినవి:

 • బెండకాయలు-పావు కేజీ,
 • ఉల్లిగడ్డ-1, ఆవాలు,
 • జీలకర్ర-టీ స్పూను చొప్పున, ఎండుమిర్చి-6,
 • పచ్చిమిర్చి - 4, టొమాటో-1,
 • జీలకర్ర, మెంతిపొడి-టీ స్పూను,
 • అల్లంవెల్లుల్లి ముద్ద-అర టీ స్పూను,
 • కారం-అర టీ స్పూను, చింతపండు రసం-కప్పు,
 • శనగపిండి-2 టీ స్పూన్లు,
 • పసుపు-పావు టీ స్పూను,
 • కొత్తిమీర-చిన్న కట్ట,
 • కరివేపాకు - 2 రెమ్మలు

విధానం:

బెండకాయలను శుభ్రంగా కడిగి ముక్కలు చేయాలి. స్టౌ మీద మందపాటి గిన్నెలో నూనె వేడయ్యాక ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి వేసి వేగాక బెండకాయముక్కలు, ఉల్లితరుగు, పచ్చిమిర్చి, టొమాటో వేసి కలపాలి. మగ్గాక జీలకర్ర, మెంతిపొడి, పసుపు, అల్లంవెల్లుల్లి ముద్ద, కారం, చింతపండు పులుసు, తగినంత నీరు పోసి మరగనివ్వాలి. చిన్న గ్లాసుడు చన్నీటిలో శనగపిండిని ఉండలు లేకుండా కలిపి మరుగుతున్న పులుసులో పోసి కలపాలి. చివరగా కొత్తిమీర, కరివేపాకు వేసి దింపేయాలి.
బెండకాయ దప్పళం