బెండకాయ పెరుగుపచ్చడి
  • 311 Views

బెండకాయ పెరుగుపచ్చడి

కావలసినవి:

  • బెండకాయ ముక్కలు - అరకప్పు
  • నూనె - రెండు టీ స్పూన్లు
  • అల్లం తరుగు - టీ స్పూను
  • పచ్చిమిర్చి తరుగు - టీ స్పూను
  • కరివేపాకు - రెండు రెమ్మలు
  • పెరుగు - క ప్పు
  • ఉప్పు - తగినంత
  • పసుపు - చిటికెడు


పోపుకోసం:

  • ఎండుమిర్చి - 2
  • ఆవాలు - అర టీ స్పూను
  • మినప్పప్పు - అర టీ స్పూను
  • శనగపప్పు - అర టీ స్పూను

విధానం:

బెండకాయలను తరిగి కొంచెం సేపు ఆరనివ్వాలి. బాణలిలో నూనె కాగాక పోపు దినుసులు వేసి వేయించాలి. తరవాత అల్లం, పచ్చిమిర్చి, కరివేపాకు, బెండకాయముక్కలు వేసి రెండు నిముషాలు వేయించి మూతపెట్టి సన్నమంట మీద ఉడికించాలి. దీనిలో నీళ్లు పోయనవసరం లేదు. ముక్కలు పూర్తిగా వేగాక, స్టౌమీద నుంచి దింపి చల్లారనివ్వాలి. ఒక గిన్నెలోకి పెరుగు తీసుకుని దానిని బాగా చిలికి, అందులో ఉప్పు, పసుపు వేయాలి. తరవాత పోపుతో వేయించి, చల్లార్చిన బెండకాయ ముక్కలు కూడా వేసి బాగా కలపాలి. ఇది అన్నంలోకి, రోటీలలోకి చాలా బావుంటుంది.