బెండకాయ పప్పుల వేపుడు
  • 546 Views

బెండకాయ పప్పుల వేపుడు

కావలసినవి:

  • బెండకాయముక్కలు - కప్పు,
  • పసుపు - చిటికెడు
  • కరివేపాకు - రెండు రెమ్మలు, ఉప్పు,
  • కారం - తగినంత
  • వేయించిన పల్లీలు (వేరుశనగపప్పు) - మూడు టీ స్పూన్లు
  • పుట్నాలపప్పు (వేయించిన శనగపప్పు) - రెండు టీ స్పూన్లు
  • ఎండుకొబ్బరి - చిన్న ముక్క,
  • వెల్లుల్లి రెబ్బలు - రెండు
  • నూనె - రెండు టీ స్పూన్లు


పోపుకోసం:

  • ఆవాలు - అర టీ స్పూను
  • శనగపప్పు -అర టీ స్పూను
  • ఎండుమిర్చి - 4,
  • మినప్పప్పు - అర టీ స్పూను

విధానం:

వేయించిన పల్లీలు, పుట్నాలపప్పు, వెల్లుల్లి, ఎండుకొబ్బరి... వీటిని పొడిగా చేసుకొని పక్కన పెట్టుకోవాలి. బెండకాయలను చిన్న ముక్కలుగా చేసుకొని కాసేపు ఆరనివ్వాలి. బాణలిలో నూనె వేడిచేసి పోపు సామాను వేసి, వేగాక కరివేపాకు, బెండకాయముక్కలు కూడా వేసి రెండు నిమిషాలు వేయించి మూత పెట్టి ఉడకనివ్వాలి. ముక్కలు పూర్తిగా వేగాక ఉప్పు, కారం, పల్లీల పొడి, పసుపు వేసి కలిపి దించుకోవాలి.