బెండకాయ రైతా
  • 373 Views

బెండకాయ రైతా

కావలసినవి:

  • బెండకాయలు: 100 గ్రా.
  • వేయించేందుకు సరిపడా నూనె
  • పెరుగు: 4 కప్పులు
  • ఉప్పు: రుచికి సరిపడ
  • కారం: ఒక చిటికెడు
  • జీలకర్రపొడి: ఒక చిటికెడు.

విధానం:

బాణలిలో తగినంత నూనె వేసి బెండకాయలు కరకరలాడేలా వచ్చే దాకా వేయించాలి. నూనె ఓడ్చి వాటిని బయటకు తీసి వాటిని బ్లాటింగ్‌ పేపర్‌ మీద ఉంచి పక్కకు పెట్టుకోవాలి. పెరుగులో ఉప్పు, కారం, వేయించిన జీలకర్ర పొడి వేసి బాగా చలిక కొట్టాలి. ఈ మొత్తాన్ని ఒక అరగంట పాటు రిఫ్రిజరేటర్‌లో ఉంచాలి. సర్వ్‌ చేసే ముందు వేయించిన బెండకాయలలో ముప్పావు భాగాన్ని పెరుగులో కలపాలి. మిగిలిన వాటితో గార్నిషింగ్‌ చేసి వెంటనే సర్వ్‌ చేయాలి, తిన డానికి చల్లచల్లగా, కరకరలాడుతూ రుచిగా ఉంటుంది.