బెండకాయ టొమాటో పచ్చడి
  • 227 Views

బెండకాయ టొమాటో పచ్చడి

కావలసినవి:

  • బెండకాయ ముక్కలు - కప్పు,
  • టొమాటో ముక్కలు - కప్పు,
  • చింతపండు - కొద్దిగా,
  • ధనియాలు - టీ స్పూను,
  • శనగపప్పు - రెండు టీ స్పూన్లు,
  • మెంతులు - కొద్దిగా,
  • మినప్పప్పు - టీ స్పూను,
  • ఎండుమిర్చి - 8,
  • ఆవాలు - అర టీ స్పూను,
  • జీలకర్ర - అర టీ స్పూను
  • కరివేపాకు - రెండు రెమ్మలు,
  • ఇంగువ - చిటికెడు
  • నూనె - నాలుగు టీ స్పూన్లు,
  • పసుపు - చిటికెడు
  • ఉప్పు - తగినంత

విధానం:

బాణలిలో చెంచాడు నూనె వేసి ధనియాలు, శనగపప్పు, మినప్పప్పు, మెంతులు వేసి కొద్దిగా వేగాక, ఎండుమిర్చి కూడా వేసి వేయించి పక్కన పెట్టుకోవాలి. అదే బాణలిలో మరో రెండు స్పూన్ల నూనె వేసి తరిగిన బెండకాయ ముక్కలు, టొమాటో ముక్కలు, పసుపు వేసి రెండు నిముషాలు వేయించి మూత పెట్టి ఉడికించాలి. వేయించిన ధనియాలను మిక్సీలో వేసి మెత్తగా పొడి చేసుకొని, దానిలో నానబెట్టిన చింతపండు, ఉప్పు, ఉడికించి చల్లార్చిన బెండ, టొమాటో మిశ్రమం వేసి మరోసారి మిక్సీ వేయాలి. మరీ మెత్తగా కాకూడదు. బాణలిలో నూనె కాగాక, పోపుదినుసులు వేయించాలి. చిటపటలాడాక కరి వేపాకు, ఇంగువ, ఎండుమిర్చి వేసి వేయించి ఈ పోపును పచ్చడిలో కలపాలి.