బెండకాయ ఉల్లికారం
 • 297 Views

బెండకాయ ఉల్లికారం

కావలసినవి:

 • పొడవుగా తరిగిన బెండకాయ ముక్కలు - కప్పు
 • ఉల్లిపాయ ముక్కలు - అర కప్పు
 • కరివేపాకు - రెండు రెమ్మలు
 • పసుపు - చిటికెడు,
 • ఉప్పు - తగినంత
 • నూనె - టేబుల్ స్పూన్

పోపుకోసం:

 • ఎండుమిర్చి - 4
 • ఆవాలు - అర టీ స్పూను
 • మినప్పప్పు - అర టీ స్పూను
 • శనగపప్పు - అర టీ స్పూను

విధానం:

బాణలిలో చెంచాడు నూనె వేసి, ఉల్లిపాయముక్కలు, పసుపు వేసి వేయించాలి. బాగా వేగాక ఎండుమిర్చి కూడా వేసి మరో నిముషం పాటు వేయించి పక్కన పెట్టుకోవాలి. ఈ ముక్కలు చల్లారాక మిక్సీలో వేసి మెత్తగా చేసుకోవాలి. బాణలిలో నూనె వేసి వేడయ్యాక పోపుదినుసులు వేసి వేయించాలి. చిటపటలాడాక కరివేపాకు, బెండకాయముక్కలు వేసి రెండు నిముషాలు వేయించి మూతపెట్టి సన్నమంట మీద ఉడికించుకోవాలి. ముక్కలు వేగాక ముందుగా సిద్ధం చేసుకున్న ఉల్లికారం, తగినంత ఉప్పు వేసి రెండు నిముషాలు వేయించాలి.