ఒక పాత్రలో పుట్నాలపొడి, పల్లీపొడి, జీడిపప్పు పలుకులు, కొద్దిగా నెయ్యి వేసి బాగా క లిపి పక్కనుంచుకోవాలి. తరవాత కలిపి ఉంచుకున్న మైదాపిండిని ఉండలుగా చేసుకుని సన్నగా పొడవుగా వత్తాలి. దానిమీద పల్లీపొడి మిశ్రమాన్ని ఉంచి రోల్ చే సి పక్కనుంచుకోవాలి. బాణలిలో నూనెను సన్నమంట మీద కాగనివ్వాలి. తయారుచేసి ఉంచుకున్న వీటిని ఒక్కొక్కటిగా నూనెలో వేసి దోరగా వేగనివ్వాలి. మరో పాత్రలో పంచదార, తగినంత నీరు పోసి తీగపాకం రానివ్వాలి. వేయించి ఉంచుకున్న కాజాలను అందులో వేసి పది నిముషాలుంచి తీసేయాలి.